అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి నవ రాత్రుల మహోత్సవం సందర్భంగా గణపతికి 150 కేజీల భారీ లడ్డూను సమర్పించారు. కోటపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దేశిన సత్యనారాయణ (నల్లబ్బాయి) మరియు వారి కుటుంబ సభ్యులు ఈ లడ్డూను స్వామివారికి సమర్పించారు.
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–మహాలక్ష్మి దంపతులు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి–సుమేఘ దంపతుల చేతుల మీదుగా లడ్డూను గణపతికి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


