శ్రీకాళహస్తి, మే 02 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగినేని చెంచయ్య నాయుడు సంయుక్తంగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు. జిల్లా స్థాయిలో ‘లో విజన్’ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన చంద్రగిరి మండలానికి చెందిన మౌనిక, ద్వితీయ స్థానం పొందిన తొట్టంబేడు మండలానికి చెందిన కె. శ్రీకాంత్, అలాగే ‘హియరింగ్ ఇంపెయిర్డ్’ విభాగంలో తృతీయ స్థానం సాధించిన తిరుపతి అర్బన్ మండలానికి చెందిన సి. త్రివేణిలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో కె.వి.ఎన్. కుమార్, సహిత విద్య కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, శారీరక వైకల్యాలను అధిగమించి విద్యార్థులు సాధించిన విజయాలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు, సహిత విద్యా ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘బడి పిలుస్తోంది’ ఘన ఆరంభం… ప్రత్యేక అవసరాల విద్యార్థుల ప్రతిభకు ఘన సత్కారం