Monday, 3 August 2026
  • Home  
  • ఎస్టీయూ భవన్‌లో ఉచిత ఉపన్యాస కళ శిక్షణ విజయవంతం
- E-పేపర్

ఎస్టీయూ భవన్‌లో ఉచిత ఉపన్యాస కళ శిక్షణ విజయవంతం

ఎస్టీయూ భవన్‌లో ఉచిత ఉపన్యాస కళ శిక్షణ విజయవంతం కడప (పున్నమి ప్రతినిధి): కడపలోని ఎస్టీయూ భవన్‌లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ (ఉపన్యాస కళ) పై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, స్టేజ్ ఫియర్‌ను అధిగమించే పద్ధతులపై పాల్గొన్న వారికి సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జాతీయ ప్రతినిధులు డాక్టర్ శ్రీధర్ విట్టల, రత్నశేఖర్ ముఖ్య శిక్షకులుగా హాజరై విలువైన సూచనలు చేశారు. రీజన్-18 అధ్యక్షురాలు అనిత రెడ్డి, కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి, కడప, అన్నమయ్య జిల్లాల ప్రతినిధులు పాల్గొని శిక్షణార్థులను అభినందించారు. ఈ శిక్షణలో మొత్తం 25 మంది పాల్గొని ఉపన్యాస కళలో ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలను అభ్యసించారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఇటువంటి ఉచిత శిక్షణలు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ శిక్షణలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నందున ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సభ్యత్వం లేదా శిక్షణకు సంబంధించిన వివరాల కోసం 9390024629 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి సంబంధించిన మరిన్ని ఉచిత శిక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎస్టీయూ భవన్‌లో ఉచిత ఉపన్యాస కళ శిక్షణ విజయవంతం

కడప (పున్నమి ప్రతినిధి): కడపలోని ఎస్టీయూ భవన్‌లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ (ఉపన్యాస కళ) పై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదికపై ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, స్టేజ్ ఫియర్‌ను అధిగమించే పద్ధతులపై పాల్గొన్న వారికి సమగ్ర అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జాతీయ ప్రతినిధులు డాక్టర్ శ్రీధర్ విట్టల, రత్నశేఖర్ ముఖ్య శిక్షకులుగా హాజరై విలువైన సూచనలు చేశారు. రీజన్-18 అధ్యక్షురాలు అనిత రెడ్డి, కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి, కడప, అన్నమయ్య జిల్లాల ప్రతినిధులు పాల్గొని శిక్షణార్థులను అభినందించారు.
ఈ శిక్షణలో మొత్తం 25 మంది పాల్గొని ఉపన్యాస కళలో ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలను అభ్యసించారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఇటువంటి ఉచిత శిక్షణలు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ శిక్షణలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నందున ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సభ్యత్వం లేదా శిక్షణకు సంబంధించిన వివరాల కోసం 9390024629 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి సంబంధించిన మరిన్ని ఉచిత శిక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.