శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రకృతి, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా పోస్టర్ ప్రజెంటేషన్, సీడ్ బాల్స్ తయారీ, ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి పక్షుల గూళ్లు, ఆహార పాత్రల తయారీ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు.పోస్టర్ల ద్వారా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను వివరించడంతో పాటు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులుల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరాన్ని విద్యార్థినులు చక్కగా వివరించారు.ప్రకృతి పరిరక్షణలో భాగంగా విద్యార్థినులు తయారు చేసిన సీడ్ బాల్స్‌ను విద్యార్థులు, అధ్యాపకులకు పంపిణీ చేశారు. వాటిని అనువైన ప్రదేశాల్లో నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే కళాశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో సంచరించే పక్షులకు ఉపయోగపడేలా ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆకర్షణీయమైన పక్షి గూళ్లు, బర్డ్ ఫీడర్లను విద్యార్థినులు రూపొందించారు. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.కళాశాల ప్రిన్సిపల్ ఇన్‌చార్జి డాక్టర్ పి.వి. దుర్గావతి మార్గదర్శకత్వంలో, జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్. రమణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అధ్యాపకులు డాక్టర్ ఎ. కళ్యాణి, ఐ. అనిత హేమశ్రీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినూత్న ఆలోచనలతో ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై చైతన్యం కల్పించిన విద్యార్థినులను ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.

విజయవాడ….. 28/7/2026……శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, ప్రపంచ పులుల దినోత్సవం