అనంతగిరి మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి,వై.సంతోషి, విఆర్ఓ,లక్ష్మి ప్రశాంతి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు నోటీసులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం,1994తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం,అనధికారికంగా దుకాణాలు,ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించి,భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే చర్యలు చేపడతామని వారు తెలిపారు.
ఈ మేరకు కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మువ్వల కృష్ణ,విజ్ఞాపు మహాలక్ష్మి,మూ నూరు. పరుశురాం,మజ్జి అప్పలరాజు, దొండపర్తి అక్కులు,గొర్రె కోటేశ్వరమ్మ,కొట్యాడా కవిత, కొర్ర తులసి,దేవా భక్తుల చంటిబాబు తదితరులకు ముందస్తు నోటీసులు జారీ చేసినట్లు వారు తెలిపారు.
నోటీసులు అందుకున్న వారు తమకు సంబంధించిన స్థలాలపై ఉన్న అనధికారిక నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించు కోవాలని అధికారులు సూచించారు.లేదా ఆ స్థలాలకు సంబందించిన అధికారిక పత్రాలు,ఇతర అనుమతులు వారి వద్ద ఉంటే సచివాలయంలో సంప్రదించా లని వారు తెలిపారు
.నిర్ణీత గడువులోగా ఆక్రమణలను తొలగించకపోతే పంచాయతీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



