గాజువాక, (పున్నమి ప్రతినిధి): ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు, అక్రమాలు చోటుచేసుకోకుండా బూత్ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొత్తగా అర్హత పొందిన వారిని ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు, జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల జాబితా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలో సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.




