ప్రతిభకు అభినందనలు… విద్యార్థినికి ఘన సన్మానం
(ఏ వి జి ) ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ ,వరలక్ష్మి
పట్టుదలకి ప్రతీక సుష్మ… టాప్ ర్యాంక్‌తో అందరి ప్రశంసలు
పున్నమి న్యూస్ ప్రతినిధి
05 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
మేడిపల్లి నక్కర్త ప్రాంతానికి గర్వకారణమైన సంఘటన చోటు చేసుకుంది. పదోతరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానాన్ని సాధించిన గోదాసు యాదయ్య కుమార్తె సుష్మ ని ఈరోజు ఘనంగా సత్కరించడం జరిగింది.
గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగిన సుష్మ, కష్టపడి చదువుతూ తన కుటుంబానికి, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తెచ్చింది. తండ్రి గోదాసు యాదయ్య సాధారణ ఉద్యోగి అయినప్పటికీ, తన కుమార్తె విద్య కోసం చేసిన కృషి ఈ విజయంతో ఫలించింది.
ఈ సందర్భంగా ఎ వి జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ ,వరలక్ష్మి ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు కామిశెట్టి వెంకటయ్య (ఉపాధ్యాయులు) స్వయంగా సుష్మ ని అభినందించి శాలువాతో సత్కరించారు. ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఆడాల గణేష్ మాట్లాడుతూ,
“గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. సుష్మ వంటి విద్యార్థులు సమాజానికి ఆదర్శం” అని పేర్కొన్నారు.
కామిశెట్టి వెంకటయ్య మాట్లాడుతూ,
“కష్టపడి చదివితే ఎలాంటి పరిస్థితులైనా విజయాన్ని ఆపలేవు. సుష్మ విజయం అందరికీ స్ఫూర్తి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సుష్మ కి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు.
ప్రత్యేక అభినందనలు
గోదాసు సుష్మ కి హృదయపూర్వక శుభాకాంక్షలు
ఇంకా ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ…
సన్మానం నిర్వహించిన వారు (ఎ వి జి) ఫౌండేషన్ చైర్మన్ పౌడర్…



