Tuesday, 29 September 2026
  • Home  
  • ప్రజా కష్టమే తన కష్టంగా.. బాధితుడి ఇంటికే ఎమ్మెల్యే! రూ.7 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందజేత
- అనకాపల్లి

ప్రజా కష్టమే తన కష్టంగా.. బాధితుడి ఇంటికే ఎమ్మెల్యే! రూ.7 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందజేత

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) రాంబిల్లి: ప్రజా సేవలో భాగంగా కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం గోవిందపాలెం గ్రామ పౌరోహితులు చిట్టా వర్జుల సూరి ప్రకాష్ రావు ఇటీవల తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.7 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ, కష్టకాలంలో తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకోవడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు, అనకాపల్లి జిల్లా పురోహితుల సంఘం అధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, టీడీపీ ఎస్సీ జడ్ నాయకులు సిహెచ్. ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

రాంబిల్లి: ప్రజా సేవలో భాగంగా కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం గోవిందపాలెం గ్రామ పౌరోహితులు చిట్టా వర్జుల సూరి ప్రకాష్ రావు ఇటీవల తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.7 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ, కష్టకాలంలో తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకోవడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు, అనకాపల్లి జిల్లా పురోహితుల సంఘం అధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, టీడీపీ ఎస్సీ జడ్ నాయకులు సిహెచ్. ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.