Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మధురవాడ, గోపాలపట్నం ప్రాంతంలో తోపుడుబండ్లు తొలగింపులు ఆపాలి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మధురవాడ, గోపాలపట్నం ప్రాంతంలో తోపుడుబండ్లు తొలగింపులు ఆపాలి.

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మధురవాడ, గోపాలపట్నం, చిన్న వాల్తేర్ కోట స్కూల్ తోపుడుబండ్లు కార్మికులతో సోమవారం ధర్నా జరిగింది.
  • ఈ ధర్నాను ఉద్దేశించి విశాఖపట్నం తోపుడు బండ్లు, చిల్లర వర్తక కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.సింహాచలం మాట్లాడుతూ నగర వ్యాప్తంగా తోపుడు బండ్లు తొలగింపులు ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని, జీవీఎంసీ కమిషనర్ని డిమాండ్ చేశారు.
  • మధురవాడలోని కొమ్మాది ఇతర ప్రాంతాలు, గోపాల పట్నం తోపుడుబండ్ల కార్మికులు పై దాడులు ఆపాలని వారికి ఉపాధి రక్షణ కల్పించాలని కోరారు.

విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మధురవాడ, గోపాలపట్నం, చిన్న వాల్తేర్ కోట స్కూల్ తోపుడుబండ్లు కార్మికులతో సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి విశాఖపట్నం తోపుడు బండ్లు, చిల్లర వర్తక కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.సింహాచలం మాట్లాడుతూ నగర వ్యాప్తంగా తోపుడు బండ్లు తొలగింపులు ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని, జీవీఎంసీ కమిషనర్ని డిమాండ్ చేశారు. మధురవాడలోని కొమ్మాది ఇతర ప్రాంతాలు, గోపాల పట్నం తోపుడుబండ్ల కార్మికులు పై దాడులు ఆపాలని వారికి ఉపాధి రక్షణ కల్పించాలని కోరారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో తోపుడు బండ్ల కార్మికులపై దాడులు చేయడం అన్యాయమన్నారు. తోపుడు బండ్లు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి పి.వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తోపుడుబండ్ల కార్మికుల మీద దాడులు చేయడం వలన ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక నగరాల్లో తోపుడు బండ్లును తొలగిస్తూ వీరికి ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. విశాఖ నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గజం 95 పైసలకి లులు మాల్, డేటా సెంటర్లకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు అంబానీ, ఆదానిలకువేలకోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం కట్టబడుతుందని విమర్శించారు. మరో ప్రక్క స్వయం ఉపాధితో బ్రతికే చిల్లర వర్తకులపై దాడులు చేస్తూ తోపుడుబండ్లను తొలగిస్తున్నారని విమర్శించారు. దీనిని బట్టి ఈ ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల ప్రభుత్వం తప్ప పేదల ప్రభుత్వం కాదని అన్నారు. 2014 వీధివిక్రయదారుల రక్షణ చట్టం పరిధిలో జీవో నెంబర్ 137 ,151 ప్రకారం వెండింగ్ కార్డులు ఇచ్చి, వెల్డింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ చట్టాన్ని పాటించకుండా జీవీఎంసీ కమిషనర్ అన్యాయంగా తోపుడుబండ్ల కార్మికులను రోడ్లపాలు చేస్తున్నారని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటరెడ్డి నాయకత్వంలో జీవీఎంసీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం తోపుడుబండ్ల కార్మికులపై దాడులు ఆపి యధావిధిగా కొనసాగించాలని అధికారులను డిమాండ్ చేశారు. మరో ప్రక్క వీధి విక్రయదారుల రక్షణ చట్టం పటిష్టంగా అమలు చేసి ఉపాధి హామీ కల్పించాలని, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దిలపాలెం జోన్ సిఐటియు అధ్యక్షులు డి.అప్పలరాజు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పి.రాజ్ కుమార్, తోపుడు బండ్లు సంఘం నాయకులు దుంగ శ్రీను, తోపుడుబండ్లు సంఘం గోపాల పట్నం నాయకులు పి.మురళి, చిన వాల్తేర్ నాయకులు ఏ.అప్పారావు, రాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటరావు తోపుడు బండ్లు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *