అనంతసాగరం సెప్టెంబర్ 28, పున్నమి ప్రతినిధి :
సోమశిల జలాశయానికి
పై తట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది.గురువారం 6600 క్యూసెక్కుల వరద, శుక్రవారం 10500 క్యూసెక్కుల వరద, శనివారం 6639 క్యూసెక్కుల వరద, ఆదివారం 5878 క్యూసెక్కుల వరద నమోదు కాగా.. సోమవారం 3684 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి జలాశయానికి చేరుతుంది.. ప్రస్తుతం జలాశయంలో 18.760 టీఎంసీల నీరు నిల్వ ఉంది.. ప్రస్తుతం జలాశయానికి 3684 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.


