అనంతసాగరం, ఆగష్టు 26,పున్నమి ప్రతినిధి:
ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యం నిండాలని కోరుకుంటూ అందరికీ మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలను మంత్రి ఆనం తెలిపారు.ముస్లిం సమాజంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మిలాద్ ఉన్ నబీ . ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ఈ రోజును భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని, బోధనలను పాటిస్తూ, ఆదర్శంగా నిలవాలని అన్నారు.నిజాయితీ, దయ, క్షమ, ప్రేమ, సహనం, ఇతరులకు సహాయం చేయడం వంటి విలువలకు ప్రవక్త ఇచ్చిన ప్రాధాన్యతను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు మంత్రి ఆనం తెలిపారు.


