Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*🦯విధి నిర్వహణలో ప్రత్యేక ముద్ర వేస్తున్న ఎస్ఐ ప్రియాంక*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*🦯విధి నిర్వహణలో ప్రత్యేక ముద్ర వేస్తున్న ఎస్ఐ ప్రియాంక*

తిరుపతి జిల్లా శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక, విధి నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్నారు.

తమ సిబ్బందితో కలిసి తరచూ వాహన తనిఖీలు నిర్వహిస్తూ, ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

వికేఆర్‌వై కాలనీ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ ప్రియాంక..
*“మీ భద్రత – మా బాధ్యత”* అనే నినాదంతో ప్రతి ద్విచక్ర వాహనాన్ని ఆపి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచిస్తున్నారు.

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అదేవిధంగా మద్యం సేవించి లారీ నడిపిన ఓ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. డ్రైవర్‌కు రూ.12,000 అపరాధ రుసుము విధించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా డ్రైవర్‌కు అవగాహన కల్పించారు.

మరోవైపు చిలమత్తూరుకు చెందిన ట్రాక్టర్ యజమాని తేజ, డ్రైవర్ బాబుతో కలిసి తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న రహస్య సమాచారంతో ఎస్ఐ ప్రియాంక సిబ్బందితో కలిసి కాపుకాశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకుని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

*🎤ఈ సందర్భంగా ఎస్ఐ ప్రియాంక మాట్లాడుతూ..*

శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం పనిచేస్తారని తెలిపారు.

విధి నిర్వహణతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఎస్ఐ ప్రియాంక తీరుపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

*🦯విధి నిర్వహణలో ప్రత్యేక ముద్ర వేస్తున్న ఎస్ఐ ప్రియాంక*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *