రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 1,874 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


