పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను స్వాగతించిన కేటీఆర్, హరీష్ రావు
పున్నమి న్యూస్ ప్రతినిధి
22ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి డిస్టిక్
9640204826
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు
రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగడుతుంది
ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేయాలి
అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, ముమ్మాటికీ పీసీసీ నివేదిక అని మేము ముందు నుంచి చెబుతుంది ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయింది – కేటీఆర్
సత్యమేవ జయతే
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి
ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజ స్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది – హరీష్ రావు



