పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేయాలి: అతికారి కృష్ణ
కడప జిల్లా రాజంపేట మండలం జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మన్నూరులోని తోట కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్ఈడీ స్క్రీన్ల ద్వారా పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


