వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
లారస్ ల్యాబ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులకు పర్యావరణ హితమైన మట్టి గణపతి బొమ్మలను అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని, ప్రజలకు విగ్రహాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చి మట్టి వినాయక విగ్రహాలను తీసుకెళ్లారు.
లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.
Uploaded Video:


