పున్నమి ప్రతినిధి ,విద్య జూలై 18
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కమిషనరేట్, మంగళగిరి ఆదేశాల మేరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేడు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణం, తరగతి గదులు, ప్రయోగశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులు, సిబ్బంది అందరూ “స్వచ్ఛ ఆంధ్ర” ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాధికారులు, ఎన్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థినులు మరియు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ ఐ. వి. లలిత కుమారి సమన్వయం చేశారు.


