-నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు ఈనెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు బారా షాహిద్ దర్గా నందు రొట్టెల పండుగ జరగనున్న సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీకల్లా అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తామని, అందరూ కలసి రొట్టెలపండుగకు వచ్చే, లక్షలాదిమంది భక్తులకు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు. గతంలో కంటే మిన్నగా, ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ల సహాయ సహకారాలతో రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్ ల ఆధ్వర్యంలో అందరం కలసి, రొట్టెల పండుగను విజయవంతం చేస్తామని చెప్పారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, ముస్లిం నాయకులు సమీ హుసేని, షేక్ షంషుద్దీన్, సాబీర్ ఖాన్, మునీర్ భాష, అబూబకర్, షేక్ జిలాని, చిన్న మస్తాన్, అబ్దుల్ రసూల్, ఖాదర్ భాష, హాయాత్ భాషా, అహ్మద్, ముజామిల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


