పులివెందుల నియోజకవర్గంలో పత్తి పంటకు పచ్చ పురుగు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వేసవి పంటగా ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 20 వేల ఎకరాలకు పైగా పత్తి సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం పచ్చ పురుగు ఆశించి లేత చిగుర్లను, కొమ్మలను తినేస్తుండటంతో మొక్కల ఎదుగుదల ఆగిపోతోంది. రాత్రి వేళల్లో ఈ పురుగు తీవ్రంగా నష్టం కలిగిస్తోందని, మందులు పిచికారీ చేసినా నివారణ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.

పత్తి పంటకు పచ్చ పురుగు | రైతులు తీవ్ర ఆందోళన