Saturday, 23 May 2026
  • Home  
  • అనుమతులు లేని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు ఎక్కడ..?*
- ఖమ్మం

అనుమతులు లేని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు ఎక్కడ..?*

*అనుమతులు లేని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు ఎక్కడ..?* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ మధిర గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న బెల్ట్ షాపులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయాలు జరుపుతున్నప్ప టికీ ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండాల్సిన సమయంలో, కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా బహిరంగంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కువగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్రమ మద్యం నిల్వలు, అనధికార విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో పరిస్థితి మారలేదని ప్రజలువిమర్శిస్తున్నారు. కొందరు బెల్ట్ షాపుల నిర్వాహకులు అధికారుల అండ దండలతోనే వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసలవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేస్తున్నారు.

*అనుమతులు లేని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు ఎక్కడ..?*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

మధిర
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న బెల్ట్ షాపులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయాలు జరుపుతున్నప్ప
టికీ ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు
ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండాల్సిన సమయంలో, కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా బహిరంగంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కువగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అక్రమ మద్యం నిల్వలు, అనధికార విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో పరిస్థితి మారలేదని ప్రజలువిమర్శిస్తున్నారు. కొందరు బెల్ట్ షాపుల నిర్వాహకులు అధికారుల అండ దండలతోనే వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసలవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.