Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి ప్రణయ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి ప్రణయ్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమలాయపాలెం, అక్టోబర్ 14: తిరుమలాయపాలెం మండలంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా అధికారి ప్రణయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగించే విధానంపై సిబ్బందికి వివరించారు.
  • రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడే విధానాలపై సూచనలు చేశారు.

తిరుమలాయపాలెం, అక్టోబర్ 14: తిరుమలాయపాలెం మండలంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా అధికారి ప్రణయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగించే విధానంపై సిబ్బందికి వివరించారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడే విధానాలపై సూచనలు చేశారు. తిరుమలాయపాలెం మండలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలు 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ తనిఖీలో 108 సిబ్బంది లింగంపల్లి కృష్ణయ్య, మందడి అజయ్, ధర్మసూద్ సక్రు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *