Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రేపు తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

వార్త ముఖ్యాంశాలు

  • బీటీ రోడ్డు శంకుస్థాపన, వీఓ భవనం ప్రారంభోత్సవం..
  • కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తిరుమలాయపాలెం, అక్టోబర్ 10: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించనున్నారు.
  • ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.

బీటీ రోడ్డు శంకుస్థాపన, వీఓ భవనం ప్రారంభోత్సవం.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

తిరుమలాయపాలెం, అక్టోబర్ 10: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు తేట్టేలపాడు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు సుబ్లేడు గ్రామంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రామ సమాఖ్య (వీఓ) భవనాన్ని ప్రారంభించి, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం 3:30 గంటలకు కాకరవాయి గ్రామంలో పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈ కార్యక్రమాలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల అశోక్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *