వార్త ముఖ్యాంశాలు
- ప్రజా సేవలో వారి పాత్ర కీలకం: దేవకి వాసుదేవరావు కూసుమంచి, అక్టోబర్ 6: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా నేలపట్ల గ్రామంలో అంగన్ మిలాన్ కార్యక్రమం నిర్వహించారు.
- ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించారు.
- మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంక్షేమంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు కీలకమని దేవకి వాసుదేవరావు అన్నారు.
ప్రజా సేవలో వారి పాత్ర కీలకం: దేవకి వాసుదేవరావు
కూసుమంచి, అక్టోబర్ 6: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా నేలపట్ల గ్రామంలో అంగన్ మిలాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించారు.
మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంక్షేమంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు కీలకమని దేవకి వాసుదేవరావు అన్నారు. ప్రజా సేవలో భాగస్వాములవుతున్న వారి సేవలను గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డంపూడి నరేష్, గడ్డం వెంకటేశ్వర్లు, గుగులోతు మహేందర్ నాయక్, చిన్నబోయిన ఉదయ్ కిరణ్, జర్పల కోటేష్, వడ్డేంపూడి వినయ్ తదితరులు పాల్గొన్నారు.