Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రాకేష్ కుటుంబానికి మానవతా చేయూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాకేష్ కుటుంబానికి మానవతా చేయూత

వార్త ముఖ్యాంశాలు

  • 50 కిలోల బియ్యం అందజేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి తిరుమలాయపాలెం: ప్రమాదవశాత్తు మృతి చెందిన కొత్తపల్లి రాకేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రామ సహాయం నరేష్ రెడ్డి అండగా నిలిచారు.
  • రాకేష్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన, కుటుంబానికి తనవంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందించారు.
  • మంగళవారం రామ సహాయం నరేష్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ యువజన నాయకులు దామెర్ల కృష్ణ, గుండెబోయిన శ్రీశైలం రాకేష్ కుటుంబ సభ్యులను కలిసి బియ్యం బ్యాగులను అందజేశారు.

50 కిలోల బియ్యం అందజేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి

తిరుమలాయపాలెం: ప్రమాదవశాత్తు మృతి చెందిన కొత్తపల్లి రాకేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రామ సహాయం నరేష్ రెడ్డి అండగా నిలిచారు. రాకేష్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన, కుటుంబానికి తనవంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందించారు.

మంగళవారం రామ సహాయం నరేష్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ యువజన నాయకులు దామెర్ల కృష్ణ, గుండెబోయిన శ్రీశైలం రాకేష్ కుటుంబ సభ్యులను కలిసి బియ్యం బ్యాగులను అందజేశారు. ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన రాకేష్ కుటుంబానికి ఈ సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.

రాకేష్ కుటుంబానికి అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన రామ సహాయం నరేష్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *