Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పిండిప్రోలు వద్ద రోడ్డుపై పడిన గ్రానైట్ రాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పిండిప్రోలు వద్ద రోడ్డుపై పడిన గ్రానైట్ రాయి

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. నిలిచిన ట్రాఫిక్

తిరుమలాయపాలెం: పిండిప్రోలు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో గ్రానైట్ లారీని రోడ్డు పక్కకు ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గ్రానైట్ రాయి చెట్టు కొమ్మలకు తగిలి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. అదే సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

రాయితో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో వెంటనే రాయిని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని వాహనదారులు కోరుతున్నారు.

పిండిప్రోలు వద్ద రోడ్డుపై పడిన గ్రానైట్ రాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *