Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

వార్త ముఖ్యాంశాలు

  • కాకరవాయి రజక సంఘం డిమాండ్ తిరుమలాయపాలెం, అక్టోబర్ 14: మెదక్ జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను కాకరవాయి రజక సంఘం తీవ్రంగా ఖండించింది.
  • నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
  • ఈ సందర్భంగా బాసర ఐటీఐ ప్రొఫెసర్ కొత్తపల్లి రాములు మాట్లాడుతూ..

కాకరవాయి రజక సంఘం డిమాండ్

తిరుమలాయపాలెం, అక్టోబర్ 14: మెదక్ జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను కాకరవాయి రజక సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బాసర ఐటీఐ ప్రొఫెసర్ కొత్తపల్లి రాములు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాకరవాయి రజక సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి మధు కన్నయ్య, ఉపాధ్యక్షుడు దామర్ల సుధాకర్, కోఆర్డినేటర్ కొత్తపల్లి చిన్న రాములు, సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *