Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి బద్దం మహిపాల్ రెడ్డి కూసుమంచి, అక్టోబర్ 14: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి బద్దం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
  • బుధవారం కూసుమంచిలో జిల్లా నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై ఓటరు నమోదుపై చర్చించారు.
  • ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి బద్దం మహిపాల్ రెడ్డి

కూసుమంచి, అక్టోబర్ 14: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి బద్దం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కూసుమంచిలో జిల్లా నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై ఓటరు నమోదుపై చర్చించారు.

ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేఖ సత్యనారాయణ యాదవ్ సైతం అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు నమోదులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

2023 నవంబర్ 1వ తేదీ నాటికి లేదా అంతకుముందు డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఎన్నికల నిబంధనల ప్రకారం ఫారం-18 సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు చందబోయిన పుణ్యవతి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, మంద నవ్య, మంద చంద్రశేఖర్ గౌడ్, సోమనపల్లి వెంకన్న, పిట్టల వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *