వార్త ముఖ్యాంశాలు
- ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీస్ సేవలు అందిస్తా తిరుమలాయపాలెం, అక్టోబర్ 14 (పున్నమి): తిరుమలాయపాలెం మండల పోలీస్స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా పోగుల సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారం పోలీస్స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన తిరుమలాయపాలెం పోలీస్స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు.
- ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ పోగుల సురేష్ మాట్లాడుతూ..
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీస్ సేవలు అందిస్తా
తిరుమలాయపాలెం, అక్టోబర్ 14 (పున్నమి):
తిరుమలాయపాలెం మండల పోలీస్స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా పోగుల సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారం పోలీస్స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన తిరుమలాయపాలెం పోలీస్స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ పోగుల సురేష్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.