నంద్యాల:నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ ఆర్. వెంకటరమణ తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ కె. నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాతీయ నేత్రదాన పక్షోత్సవాల’ అవగాహన ర్యాలీని మంగళవారం ఆయన ప్రారంభించారు.ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు ప్రభుత్వం నిర్వహించే ఈ పక్షోత్సవాల సందర్భంగా అధికారులు నేత్రదానంపై ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేశారు. ఆరోగ్యవంతులతో పాటు మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) ఉన్నవారు మరియు కళ్లద్దాలు ధరించే వారు కూడా నేత్రదానం చేయవచ్చని వివరించారు. అయితే ఎయిడ్స్, క్యాన్సర్, హెపటైటిస్-బి వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు, అలాగే పిచ్చికుక్క కాటుకు గురైన వారు నేత్రదానానికి అనర్హులని స్పష్టం చేశారు.ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కె.ఎస్.పి. శ్రీనివాసులు, డాక్టర్ యశోదర, జిల్లా మాస్ మీడియా అధికారి మల్లేపల్లి పామున్న మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు: డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్. వెంకటరమణ