అంధులకు ఆశాజ్యోతి నేత్రదానమే, మరణానంతరం దానం చేసిన కళ్ళతో ఇద్దరు అంధులకు చూపునివ్వచ్చని అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారన్నారు. మంగళవారం రోజున ఏర్పాటుచేసిన 41 వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ లో ఈజిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ దేవేందర్ అధ్యక్షతన
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీమతి ఎల్ విజయలక్ష్మి అడిషనల్ కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారు మాట్లాడుతూ నేత్రదానం ఒక కుటుంబ సాంప్రదాయం కావాలని, నర్సింగ్ విద్యార్థులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నేత్రదానం పట్ల సమాజంలో అవగాహన కల్పించాలని అన్నారు
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం గారు మాట్లాడుతూ
ఈ పక్షోత్సవాల సందర్భంగా జనరల్ హాస్పిటల్ లో కంటి వైద్యులచే ప్రత్యేకమైన స్క్రీనింగ్ ఏర్పాటు చేయబడుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే నేత్రదానం పట్ల కూడా అవగాహన కల్పిస్తామని తెలియజేశారు.
ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ మరనానంతరం ప్రతి వ్యక్తి కళ్ళను కాల్చకుండా నేత్రదానం చేసి ఇద్దరు అందుల జీవితాలలో వెలుగు నింపడానికి నేత్రదానం చేయాలని ఈ విషయాలపట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ సందీప్, డాక్టర్ రాహుల్ , డాక్టర్ దేవేందర్ , ఆప్తాలమిక్ అధికారి బూరుగు రవికుమార్, సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, HEO మురళీధర్ రెడ్డి జమాలుద్దీన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఆశాలు, నర్సింగ్ విద్యార్థులు వైద్య ఆరోగ్య ఉద్యోగులు ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ ని కలెక్టరేట్ నుండి నిర్వహించారు. ఈ ర్యాలీ ని శ్రీమతి విజయలక్ష్మి గారు జెండా ఊపి ప్రారంభించారు.


