శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సీడ్ బాల్స్’ (విత్తన బంతులు) ద్వారా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని నగరవనంలో వర్చువల్ విధానం ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగే ఈ వినూత్న హరిత యజ్ఞంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని స్థానిక జనసేన నేతలు పిలుపునిచ్చారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై, మొక్కలు నాటే ప్రక్రియను విజయవంతం చేయాలని జనసైనికులు కోరారు.

నేడు నగరవనంలో పర్యావరణ దినోత్సవం-‘సీడ్ బాల్స్’ కార్యక్రమం