Sunday, 23 August 2026
  • Home  
  • నెల్లూరు మేయర్ పీఠం బీసీ జనరల్ కాబోతుందా?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ పీఠం బీసీ జనరల్ కాబోతుందా?

ఆశలు, ఊహల్లో ఎందరో… కూటమి ధర్మంతో జనసేనకే ఇవ్వాలనే డిమాండ్ మంత్రి ఆలోచనల్లో టీడీపీకే…? ఆశావహుల్లో రూప్‌కుమార్ యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, నంది మండలం భానుశ్రీ మున్సిపల్ మంత్రి మొగ్గు రూప్ వైపే…? రూప్ కోసమే అన్నట్లుగా బీసీ జనరల్ విషయంలో మంత్రి పావులు! వైసీపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్ రంగంలోకి దిగనున్నారా? అనిల్‌ను బరిలోకి దింపే యోచనలో వైసీపీ అధిష్ఠానం…? ఇదే జరిగితే నెల్లూరు మేయర్ బరిలో బాబాయ్–అబ్బాయిలే పందెం కోళ్లలా తలపడనున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామం త్వరలో మోగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు తన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బీసీలకు పట్టణ ప్రాంతాల్లో 33.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద కార్పొరేషన్‌గా, జిల్లా కేంద్రంగా ఉన్న నెల్లూరు కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఎస్టీ జనరల్‌కు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ పరంగా దక్కగా, ఈసారి జరగనున్న ఎన్నికల్లో బీసీ జనరల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు చాపకింద నీరులా ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీ, నెల్లూరు కార్పొరేషన్‌లో అంతర్భాగం కావడంతో పాటు జిల్లాలో రొటేషన్ ప్రకారం చూసినా, బీసీల జనాభా ప్రాతిపదికన చూసినా ఈసారి నెల్లూరు మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ ఆలోచనల్లో కూడా నెల్లూరు కార్పొరేషన్‌ను బీసీ జనరల్ చేసి, తనకు నమ్మకమైన అనుచరుడిగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో మంత్రి నారాయణ అంతర్గతంగా రూప్‌కుమార్‌కు హామీ ఇచ్చినట్లు కూడా విశ్వసనీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ జిల్లా కేంద్రంలో ఉండటం, రెండు నియోజకవర్గాలకు కీలకం కావడం, సుమారు రూ.300 నుంచి రూ.400 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగి ఉండటంతో ఎమ్మెల్యే పదవులతో సమానంగా మేయర్ పదవికీ రాజకీయంగా భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో అర్హతలు, రాజకీయ బలం ఉన్న బీసీ నేతలు ఈ పదవిపై తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మం ప్రకారం జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్న నూనె మల్లికార్జున యాదవ్ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకుని తన పార్టీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అలాగే కార్పొరేషన్ పరిధిలో భాగమైన నెల్లూరు రూరల్‌కు చెందిన మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డిల ప్రాపకంతో ఆమె ఈ సీటుపై ఆశలు పెంచుకున్నట్లు సమాచారం. అయితే మంత్రి నారాయణ మాత్రం “ఒకే మాట–ఒకే బాట” అన్నట్లుగా రూప్‌కుమార్ పేరునే తన సన్నిహితుల వద్ద ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ధర్మం ఎలా ఉన్నా, తన సొంత కార్పొరేషన్‌ను జనసేన పరం చేసేందుకు మంత్రి ఆసక్తిగా లేరనే అభిప్రాయం ఆయన సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది. మేయర్ స్థానానికి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.డీలిమిటేషన్ ప్రక్రియ న్యాయపరమైన చిక్కుల్లో తాత్కాలికంగా నిలిచిపోవడంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన విధంగానే ఈసారి కూడా 54 డివిజన్లతోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కార్పొరేషన్ పాలకవర్గానికి ఈ ఏడాది నవంబర్ 22తో పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ చివరలో లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి నారాయణ మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న రూప్‌కుమార్ యాదవ్‌కు మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మద్దతు కూడా పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రానున్న ఎన్నికల్లో నెల్లూరు మేయర్ పీఠం బీసీ జనరల్ కాబోతుందనే ప్రచారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అభ్యర్థిత్వ రేసులో రూప్‌కుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నారనే ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీ కూడా తన వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. రూప్‌కు పోటీగా అనిల్‌ను దించేందుకు వైసీపీ వ్యూహం? దీంతోనే ఇటీవల వినిపిస్తున్న అనిల్ గళం? కీలకమైన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా నెల్లూరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ కూడా తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన నెల్లూరులో కీలకమైన మేయర్ పోస్టును ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అధికార కూటమి అభ్యర్థిగా రూప్‌కుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ఆయనకు పోటీగా మాజీ మంత్రి, రూప్‌కుమార్ యాదవ్‌కు సమీప బంధువైన పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూప్‌కుమార్‌కు అధికార పార్టీ మద్దతుతో పాటు ఆర్థిక, సామాజిక బలం కూడా ఉండటం, యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను నిలువరించాలంటే బలమైన ప్రత్యర్థి అవసరమని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూప్‌కుమార్‌ను దీటుగా ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం ఉన్న నేతగా అనిల్‌కుమార్ యాదవ్ పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారని, దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అనిల్‌కుమార్‌కు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికీ వేలాది మంది అభిమానులు ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలోనూ యాదవ సామాజిక వర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి ఇప్పటికీ కొంత బలం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో సరైన నాయకత్వ సమన్వయం లేక ఆ బలం కొంత చెదిరిపోయిందనే అభిప్రాయం ఉంది. అనిల్‌ను రంగంలోకి దింపితే పార్టీ కార్యకర్తలు, అభిమానులను మళ్లీ ఒకే తాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఆయనకు ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు అనేక ఎన్నికల్లో గెలుపోటములను చూసిన అనిల్‌కుమార్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని నెల్లూరు మేయర్ పీఠం విషయంలో అధికార కూటమి అభ్యర్థిని దీటుగా ఎదుర్కోగల నేతగా కొందరు భావిస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు మేయర్ పీఠం కోసం హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కూటమి నుంచి రూప్‌కుమార్ యాదవ్, ప్రతిపక్ష వైసీపీ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ బరిలోకి దిగవచ్చనే తొలి రాజకీయ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, చివరకు మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Uploaded Video:

ఆశలు, ఊహల్లో ఎందరో… కూటమి ధర్మంతో జనసేనకే ఇవ్వాలనే డిమాండ్

మంత్రి ఆలోచనల్లో టీడీపీకే…? ఆశావహుల్లో రూప్‌కుమార్ యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, నంది మండలం భానుశ్రీ

మున్సిపల్ మంత్రి మొగ్గు రూప్ వైపే…? రూప్ కోసమే అన్నట్లుగా బీసీ జనరల్ విషయంలో మంత్రి పావులు!

వైసీపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్ రంగంలోకి దిగనున్నారా?

అనిల్‌ను బరిలోకి దింపే యోచనలో వైసీపీ అధిష్ఠానం…?

ఇదే జరిగితే నెల్లూరు మేయర్ బరిలో బాబాయ్–అబ్బాయిలే పందెం కోళ్లలా తలపడనున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామం త్వరలో మోగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు తన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బీసీలకు పట్టణ ప్రాంతాల్లో 33.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం కూడా జరిగిపోయింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద కార్పొరేషన్‌గా, జిల్లా కేంద్రంగా ఉన్న నెల్లూరు కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఎస్టీ జనరల్‌కు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ పరంగా దక్కగా, ఈసారి జరగనున్న ఎన్నికల్లో బీసీ జనరల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు చాపకింద నీరులా ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీ, నెల్లూరు కార్పొరేషన్‌లో అంతర్భాగం కావడంతో పాటు జిల్లాలో రొటేషన్ ప్రకారం చూసినా, బీసీల జనాభా ప్రాతిపదికన చూసినా ఈసారి నెల్లూరు మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు మంత్రి నారాయణ ఆలోచనల్లో కూడా నెల్లూరు కార్పొరేషన్‌ను బీసీ జనరల్ చేసి, తనకు నమ్మకమైన అనుచరుడిగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో మంత్రి నారాయణ అంతర్గతంగా రూప్‌కుమార్‌కు హామీ ఇచ్చినట్లు కూడా విశ్వసనీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్ జిల్లా కేంద్రంలో ఉండటం, రెండు నియోజకవర్గాలకు కీలకం కావడం, సుమారు రూ.300 నుంచి రూ.400 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగి ఉండటంతో ఎమ్మెల్యే పదవులతో సమానంగా మేయర్ పదవికీ రాజకీయంగా భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో అర్హతలు, రాజకీయ బలం ఉన్న బీసీ నేతలు ఈ పదవిపై తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కూటమి ధర్మం ప్రకారం జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్న నూనె మల్లికార్జున యాదవ్ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకుని తన పార్టీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అలాగే కార్పొరేషన్ పరిధిలో భాగమైన నెల్లూరు రూరల్‌కు చెందిన మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డిల ప్రాపకంతో ఆమె ఈ సీటుపై ఆశలు పెంచుకున్నట్లు సమాచారం.

అయితే మంత్రి నారాయణ మాత్రం “ఒకే మాట–ఒకే బాట” అన్నట్లుగా రూప్‌కుమార్ పేరునే తన సన్నిహితుల వద్ద ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ధర్మం ఎలా ఉన్నా, తన సొంత కార్పొరేషన్‌ను జనసేన పరం చేసేందుకు మంత్రి ఆసక్తిగా లేరనే అభిప్రాయం ఆయన సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది.

మేయర్ స్థానానికి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.డీలిమిటేషన్ ప్రక్రియ న్యాయపరమైన చిక్కుల్లో తాత్కాలికంగా నిలిచిపోవడంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన విధంగానే ఈసారి కూడా 54 డివిజన్లతోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత కార్పొరేషన్ పాలకవర్గానికి ఈ ఏడాది నవంబర్ 22తో పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ చివరలో లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి నారాయణ మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న రూప్‌కుమార్ యాదవ్‌కు మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మద్దతు కూడా పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రానున్న ఎన్నికల్లో నెల్లూరు మేయర్ పీఠం బీసీ జనరల్ కాబోతుందనే ప్రచారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అభ్యర్థిత్వ రేసులో రూప్‌కుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నారనే ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీ కూడా తన వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.

రూప్‌కు పోటీగా అనిల్‌ను దించేందుకు వైసీపీ వ్యూహం?
దీంతోనే ఇటీవల వినిపిస్తున్న అనిల్ గళం?
కీలకమైన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా నెల్లూరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ కూడా తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన నెల్లూరులో కీలకమైన మేయర్ పోస్టును ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అధికార కూటమి అభ్యర్థిగా రూప్‌కుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ఆయనకు పోటీగా మాజీ మంత్రి, రూప్‌కుమార్ యాదవ్‌కు సమీప బంధువైన పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రూప్‌కుమార్‌కు అధికార పార్టీ మద్దతుతో పాటు ఆర్థిక, సామాజిక బలం కూడా ఉండటం, యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను నిలువరించాలంటే బలమైన ప్రత్యర్థి అవసరమని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రూప్‌కుమార్‌ను దీటుగా ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం ఉన్న నేతగా అనిల్‌కుమార్ యాదవ్ పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారని, దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అనిల్‌కుమార్‌కు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికీ వేలాది మంది అభిమానులు ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలోనూ యాదవ సామాజిక వర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి ఇప్పటికీ కొంత బలం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో సరైన నాయకత్వ సమన్వయం లేక ఆ బలం కొంత చెదిరిపోయిందనే అభిప్రాయం ఉంది.

అనిల్‌ను రంగంలోకి దింపితే పార్టీ కార్యకర్తలు, అభిమానులను మళ్లీ ఒకే తాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఆయనకు ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు అనేక ఎన్నికల్లో గెలుపోటములను చూసిన అనిల్‌కుమార్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని నెల్లూరు మేయర్ పీఠం విషయంలో అధికార కూటమి అభ్యర్థిని దీటుగా ఎదుర్కోగల నేతగా కొందరు భావిస్తున్నారు.

దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు మేయర్ పీఠం కోసం హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కూటమి నుంచి రూప్‌కుమార్ యాదవ్, ప్రతిపక్ష వైసీపీ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ బరిలోకి దిగవచ్చనే తొలి రాజకీయ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, చివరకు మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.