నెల్లూరు దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో “నెల్లూరు జిల్లా కమ్మ జన సంక్షేమ సమితి” నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సంఘ బలోపేతం, సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా ఈ ఎన్నికలు నిర్వహించారు.
నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా రావి మోహన్ చౌదరి, ఎలమూరి రంగయ్య నాయుడు ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా రుద్రపాటి వెంకటేశ్వర్లు నాయుడు, ప్రధాన కార్యదర్శిగా పేరం రవికుమార్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. వైస్ ప్రెసిడెంట్లుగా సూరపనేని మల్లికార్జున్ నాయుడు, మాలెపాటి చైతన్య ఎన్నికయ్యారు. సలహాదారులుగా మద్దిపాటి ప్రసాదరావు, కన్నెధారి చంద్రశేఖర్ నియమితులయ్యారు.
ఆర్గనైజింగ్ సెక్రటరీగా వీరేపల్లి అశోక్, కోశాధికారిగా కొల్లూరు బాలకృష్ణ చౌదరి, సెక్రటరీలుగా గుడిపాటి నరసింహులు, నలుబోలు బలరామయ్య, వింజమూరు నరసింహనాయుడు, గుడ్లూరు రవిచంద్ర ఎన్నికయ్యారు. పబ్లిసిటీ సెక్రటరీగా పొత్తూరు రాధాకృష్ణ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా కొత్త కార్యవర్గం పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వైద్య సహాయం, వివాహ పరిచయ వేదికలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది.
సమావేశంలో మాజీ అధ్యక్షులు నవీన్ చౌదరి, శివరాం నాయుడు, కిలారి సుబ్రహ్మణ్యం నాయుడు, దండమూడి హేమంత్, మధుసూదన్ నాయుడు, వల్లూరి మహేష్, పావులూరి సుందర రామయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



1 Comment
కోరుకొండ జాన్ (KJR)
May 2, 2026good morning