ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో నేడు ఉదయం 10.30 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



