నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు.
– జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర రావు
*విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- *మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా మంగళవారం 371 ఆక్రమణలను తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు.
“తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది.”
2 వ జోన్ పరిధిలో కొమ్మాది జంక్షన్ నుండి గాయత్రి కాలేజీ రోడ్డు వరకు, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం నుండి జాతర పార్క్ వరకు, కొమ్మాది జంక్షన్ నుండి ఎస్.టి.బి.ఎల్ వరకు 42 ఆక్రమణలు,
3వ జోన్ పరిధిలో ఆర్కే బీచ్ పార్క్ హోటల్ రోడ్డు నుండి ఏయూ అవుట్ గేట్ వరకు, వుడా పార్కు రోడ్డు వయా వాల్తేరు డిపో నుండి శాంతి ఆశ్రమం కామత్ రోడ్డు వరకు, కామత్ హోటల్ రోడ్డు నుండి కైలాసగిరి రోప్ వే వరకు, సిరిపురం జంక్షన్ నుండి ఏయూ అవుట్ గేట్ రోడ్డు వరకు, సిరిపురం జంక్షన్ నుండి వాల్తేరు డిపో వరకు, మద్దిలపాలెం నుండి సత్యం జంక్షన్ వరకు 153 ఆక్రమణలు,
6వ జోన్ పరిధిలో
బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, వడ్లపూడి మార్కెట్ రోడ్డు నుండి కూర్మన్నపాలెం భరత్ ఐటి రోడ్డు వరకు, వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్ నుండి గాంధీ విగ్రహం జంక్షన్ వరకు, లాఖ్స్ & లాఖ్స్ జక్షన్ నుండి అపోలో ఫార్మసీ 130 అడుగుల రోడ్డు వరకు, వంటిల్లు జంక్షన్ నుండి జగ్గు జంక్షన్ వరకు 127 ఆక్రమణలు,
7వ జోన్ పరిధిలో జి ఎన్ టి రోడ్డు నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు 14 ఆక్రమణలు
వెస్ట్ జోన్ పరిధిలో కాకాని నగర్ నుండి కాకాని నగర్ జంక్షన్ వరకు, కంచరపాలెం రైతుబజార్ నుండి ఓరోసీ జంక్షన్ వరకు 20 ఆక్రమణలు,
పెందుర్తి జోన్ పరిధిలో గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుండి బాజీ జంక్షన్ వరకు 15 ఆక్రమణలతో కలిపి మొత్తం 371 ఆక్రమణలను తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా జోనల్ కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


