Friday, 15 May 2026
  • Home  
  • గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి
- నాగర్‌కర్నూల్

గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి

వెల్దండ ,అక్టోబర్ 24,: వెల్దండ మండల పరిధిలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి చెందింది. వెల్దండ మండల కేంద్రానికి చెందిన రైతు ఆలూరి లాలయ్య కు చెందిన పాడి గేదెలు బుధవారం రాత్రి తాడు తెంపుకొని రోడ్డుమీదికి వచ్చింది. హైవేపై దర్గా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక గేదె అక్కడికక్కడే చెందిందిచెందింది. మరో గేదే తీవ్ర తీవ్ర గాయాల పాలై లేవలేని స్థితిలో ఉంది. రైతు ఆలూరి లాలయ్య కుటుంబం పాడి గేదెలపై ఆధారపడి జీవిస్తున్నారు. మృతి చెందిన పాడి గేదె కుచిన్న లేగ దూడ ఉన్నది గేద చనిపోవడంతో ఆ రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రూ. 90 వేల విలువగల గేదె మృతి చెందినందున ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం అందజేయాలని బాధిత రైతు కోరుతున్నారు. ఈ ఘటన గురించి రైతు వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెల్దండ ,అక్టోబర్ 24,:
వెల్దండ మండల పరిధిలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి చెందింది. వెల్దండ మండల కేంద్రానికి చెందిన రైతు ఆలూరి లాలయ్య కు చెందిన పాడి గేదెలు బుధవారం రాత్రి తాడు తెంపుకొని రోడ్డుమీదికి వచ్చింది. హైవేపై దర్గా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక గేదె అక్కడికక్కడే చెందిందిచెందింది. మరో గేదే తీవ్ర తీవ్ర గాయాల పాలై లేవలేని స్థితిలో ఉంది. రైతు ఆలూరి లాలయ్య కుటుంబం పాడి గేదెలపై ఆధారపడి జీవిస్తున్నారు. మృతి చెందిన పాడి గేదె కుచిన్న లేగ దూడ ఉన్నది గేద చనిపోవడంతో ఆ రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రూ. 90 వేల విలువగల గేదె మృతి చెందినందున ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం అందజేయాలని బాధిత రైతు కోరుతున్నారు. ఈ ఘటన గురించి రైతు వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.