ఎండాడ
సోషల్ మీడియాలో అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి, ఓ వృద్ధుడిని రూ.20 లక్షలు మోసగించిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన అన్నపరెడ్డి సాంబశివరావు (30) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగుల కోసం ఈ మోసానికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, 62 ఏళ్ల వృద్ధుడికి వలపు వల విసిరాడు. కష్టాల్లో ఉన్నానంటూ అబద్ధాలు చెప్పి, విడతల వారీగా రూ.20 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.


