Saturday, 23 May 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఊపందిస్తున్న “బడి పిలుస్తోంది”
- ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఊపందిస్తున్న “బడి పిలుస్తోంది”

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం SPSR నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధనను గుర్తించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి గోగుల రమణయ్య గారు మరియు ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లికార్జున్ గారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని వారు తెలిపారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఈరోజు అల్లూరు మండలం కొత్తపాలెం ఆఫ్ పురిణి గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న విద్యా అవకాశాలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న కొంతమంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో తల్లిదండ్రులు, పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్య పరచారు. కార్యక్రమంలో అల్లూరు మండల విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం అల్లూరు మరియు దగదర్తి మండలాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర-2 స్టాక్ పాయింట్లను సందర్శించి, విద్యార్థి కిట్ల పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలు, స్కూల్ వారీగా ప్యాకింగ్ నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం SPSR నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధనను గుర్తించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి గోగుల రమణయ్య గారు మరియు ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లికార్జున్ గారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని వారు తెలిపారు.
ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఈరోజు అల్లూరు మండలం కొత్తపాలెం ఆఫ్ పురిణి గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న విద్యా అవకాశాలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న కొంతమంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలో తల్లిదండ్రులు, పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్య పరచారు. కార్యక్రమంలో అల్లూరు మండల విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.
అనంతరం అల్లూరు మరియు దగదర్తి మండలాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర-2 స్టాక్ పాయింట్లను సందర్శించి, విద్యార్థి కిట్ల పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలు, స్కూల్ వారీగా ప్యాకింగ్ నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.