Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో 73.64 శాతం పోలింగ్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో 73.64 శాతం పోలింగ్!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 2 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి) ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో 73.64 శాతం పోలింగ్ నమోదైంది.
  • నవంబర్ 1న నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ నివేదికను అధికారులు విడుదల చేశారు.
  • మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26,529 మంది ఓటర్లకు గాను 19,535 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

26 వార్డుల్లో 70 శాతానికి పైగా ఓటింగ్‌
26వ వార్డులో అత్యధికంగా 90.31 శాతం నమోదు

ఆత్మకూరు, నవంబర్ 2 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి)

ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో 73.64 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 1న నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ నివేదికను అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26,529 మంది ఓటర్లకు గాను 19,535 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 9,157 మంది పురుషులు, 10,378 మంది మహిళలు ఉన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు సంబంధించిన 30 పోలింగ్ యూనిట్ల వివరాలను పరిశీలిస్తే, 26వ వార్డులో అత్యధికంగా 90.31 శాతం పోలింగ్ నమోదైంది. 27వ వార్డులో 89.44 శాతం, 28వ వార్డు రెండో పోలింగ్ యూనిట్‌లో 89.45 శాతం, రెండో వార్డులో 87.56 శాతం పోలింగ్ నమోదైంది. 9వ వార్డుకు సంబంధించిన మొదటి యూనిట్‌లో 86.85 శాతం, రెండో యూనిట్‌లో 84.59 శాతం పోలింగ్ నమోదైంది.మరోవైపు, 28వ వార్డు మొదటి పోలింగ్ యూనిట్‌లో అత్యల్పంగా 47.33 శాతం పోలింగ్ నమోదైంది. మూడో వార్డులో 57.86 శాతం, పదో వార్డులో 61.35 శాతం, ఐదో వార్డులో 61.50 శాతం పోలింగ్ నమోదైంది. 24వ వార్డులో 62.51 శాతం ఓటింగ్ నమోదైంది.

మహిళా ఓటర్లు అధికం

తుది పోలింగ్ గణాంకాల ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 10,378 మంది మహిళలు, 9,157 మంది పురుషులు ఓటు వేశారు. పురుషుల కంటే మహిళలు 1,221 మంది అధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.మొత్తంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో 73.64 శాతం పోలింగ్ నమోదైనట్లు తుది నివేదిక స్పష్టం చేసింది. వార్డులవారీగా పోలింగ్ శాతాల్లో వ్యత్యాసం కనిపించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *