తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో “అన్నం పెట్టే చోట.. ఆరోగ్యం నిలిచే చోట.. అధికార హోదా మర్చిపోయి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తనిఖీ చేశారు దొరవారిసత్రం తహసీల్దార్ ఎం.రాజేంద్ర.” మావిళ్లపాడు ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.సాధారణంగా అధికారులు వస్తే ఉండే హడావిడి లేకుండా, ఎంతో సాదాసీదాగా హాస్టల్ వంటగదిలోకి వెళ్లిన రాజేంద్ర, విద్యార్థులకు పెడుతున్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. కేవలం పరిశీలించడమే కాకుండా, విద్యార్థులతో కలిసి నేలపైన కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. భోజన రుచిని, నాణ్యతను స్వయంగా ఆస్వాదించిన ఆయన, వంట సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నిర్ణీత మెనూ ప్రకారం వంటకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా, వంటగదిని మరియు హాస్టల్ ఆవరణను నిరంతరం అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన తహసీల్దార్, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నిస్సంకోచంగా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. అధికారిగా కాకుండా బాధ్యత కలిగిన వ్యక్తిగా రాజేంద్ర చూపిన సరళత, విద్యార్థుల పట్ల ఆయన కనబరిచిన ఆత్మీయతపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపించారు. ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను స్వయంగా గమనించడం తమకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న రాజేంద్ర పనితీరుపై మండలంలో హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

దొరవారిసత్రం: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో “అన్నం పెట్టే చోట.. ఆరోగ్యం నిలిచే చోట.. అధికార హోదా మర్చిపోయి
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో “అన్నం పెట్టే చోట.. ఆరోగ్యం నిలిచే చోట.. అధికార హోదా మర్చిపోయి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తనిఖీ చేశారు దొరవారిసత్రం తహసీల్దార్ ఎం.రాజేంద్ర.” మావిళ్లపాడు ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.సాధారణంగా అధికారులు వస్తే ఉండే హడావిడి లేకుండా, ఎంతో సాదాసీదాగా హాస్టల్ వంటగదిలోకి వెళ్లిన రాజేంద్ర, విద్యార్థులకు పెడుతున్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. కేవలం పరిశీలించడమే కాకుండా, విద్యార్థులతో కలిసి నేలపైన కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. భోజన రుచిని, నాణ్యతను స్వయంగా ఆస్వాదించిన ఆయన, వంట సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్ణీత మెనూ ప్రకారం వంటకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా, వంటగదిని మరియు హాస్టల్ ఆవరణను నిరంతరం అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన తహసీల్దార్, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నిస్సంకోచంగా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. అధికారిగా కాకుండా బాధ్యత కలిగిన వ్యక్తిగా రాజేంద్ర చూపిన సరళత, విద్యార్థుల పట్ల ఆయన కనబరిచిన ఆత్మీయతపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపించారు. ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను స్వయంగా గమనించడం తమకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న రాజేంద్ర పనితీరుపై మండలంలో హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

