Friday, 26 June 2026
  • Home  
  • దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం.. తాళ్లపూడి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా కిలాని వెంకటరమణ ఏకగ్రీవ ఎన్నిక
- తూర్పు గోదావరి

దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం.. తాళ్లపూడి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా కిలాని వెంకటరమణ ఏకగ్రీవ ఎన్నిక

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 26: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాళ్లపూడి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కిలాని వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాళ్లపూడి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో జిల్లా బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశానికి బీజేపీ పార్టీనే బలమైన పునాది అని, అట్టడుగు వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” నినాదాన్ని ఆచరణలో అమలు చేస్తూ ఓబీసీ వర్గాలకు రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు కిలాని వెంకటరమణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఓబీసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. తాళ్లపూడి మండలంలోని ప్రతి గ్రామంలో ఓబీసీ మోర్చాను బలోపేతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ కుటుంబ పాలన, అవినీతిని రూపుమాపడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, దేశాభివృద్ధి అనే రెండు ప్రధాన లక్ష్యాలతో పార్టీ ముందుకు సాగుతోందని, ఓబీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడంలో బీజేపీ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్, కాలెపు సత్య సాయిరాం, మన్నెం శ్రీనివాస్, ఎన్‌వీవీఎన్ ఆచారి, అత్తిలి సోమేశ్వరరావు, తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ముత్తోజు మురళి సత్య కిరణ్ కుమార్, అయినింటి చిన్న వెంకటరావు, విస్సా కోడేటి వీరబ్రహ్మం, ప్రధాన కార్యదర్శులు బాణాల సాయి నరసింహమూర్తి, గెద్ధాడ నాగ పోశయ్య, కార్యదర్శులు పెంటపాటి ప్రభాకరరావు, మల్లెమొగ్గల సత్యనారాయణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోకవరపు జితేంద్ర రవి, ఉపాధ్యక్షులు ఎలుగుబంటి బాలకృష్ణ, తిరుమలశెట్టి కృష్ణ, యువ మోర్చా అధ్యక్షుడు6 ప్రగడ సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 26:
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాళ్లపూడి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కిలాని వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాళ్లపూడి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో జిల్లా బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశానికి బీజేపీ పార్టీనే బలమైన పునాది అని, అట్టడుగు వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” నినాదాన్ని ఆచరణలో అమలు చేస్తూ ఓబీసీ వర్గాలకు రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు.

నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు కిలాని వెంకటరమణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఓబీసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. తాళ్లపూడి మండలంలోని ప్రతి గ్రామంలో ఓబీసీ మోర్చాను బలోపేతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ కుటుంబ పాలన, అవినీతిని రూపుమాపడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, దేశాభివృద్ధి అనే రెండు ప్రధాన లక్ష్యాలతో పార్టీ ముందుకు సాగుతోందని, ఓబీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడంలో బీజేపీ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్, కాలెపు సత్య సాయిరాం, మన్నెం శ్రీనివాస్, ఎన్‌వీవీఎన్ ఆచారి, అత్తిలి సోమేశ్వరరావు, తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ముత్తోజు మురళి సత్య కిరణ్ కుమార్, అయినింటి చిన్న వెంకటరావు, విస్సా కోడేటి వీరబ్రహ్మం, ప్రధాన కార్యదర్శులు బాణాల సాయి నరసింహమూర్తి, గెద్ధాడ నాగ పోశయ్య, కార్యదర్శులు పెంటపాటి ప్రభాకరరావు, మల్లెమొగ్గల సత్యనారాయణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోకవరపు జితేంద్ర రవి, ఉపాధ్యక్షులు ఎలుగుబంటి బాలకృష్ణ, తిరుమలశెట్టి కృష్ణ, యువ మోర్చా అధ్యక్షుడు6 ప్రగడ సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.