అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్య..?
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం నగిరిపాడు పంచాయతీ ఎగువపల్లి అటవీ ప్రాంతంలోని రామిరెడ్డి కుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం తీవ్రంగా పాచిపోయి పురుగులు పట్టిన స్థితిలో ఉండటంతో నాలుగు రోజుల క్రితమే ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Uploaded Video:


