బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి నున్న రవికుమార్ ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి, కోటి హనుమంతరావు, మీగడ గోపి, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొని దేవకీ వాసుదేవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను కొనియాడారు.



