Saturday, 20 June 2026
  • Home  
  • దృష్టి లోపం గల విద్యార్థుల విద్యాభివృద్ధికి 56 బ్రెయిలీ లెర్నింగ్ కిట్ల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దృష్టి లోపం గల విద్యార్థుల విద్యాభివృద్ధికి 56 బ్రెయిలీ లెర్నింగ్ కిట్ల పంపిణీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న దృష్టి లోపం గల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) డి. వెంకట సుబ్బయ్య తెలిపారు. శనివారం జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సమ్మిళిత విద్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం బ్రెయిలీ టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న దృష్టి లోపం గల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 56 బ్రెయిలీ లెర్నింగ్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కిట్లలో మ్యాథ్స్ వాల్యూమ్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉపయోగపడే యాక్టివిటీస్ సెట్, బేసిక్ టాక్టైల్ గ్లోబ్, టాక్టైల్ జ్యామెట్రీ కిట్ వంటి ఆధునిక విద్యా పరికరాలు ఉన్నాయని చెప్పారు. ఈ పరికరాల ద్వారా విద్యార్థులు సులభంగా చదవడం, రాయడం, గణిత మరియు భౌగోళిక అంశాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కిట్ల వినియోగానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించి, విద్యార్థులకు సమర్థవంతంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ) సుధీర్ బాబు మాట్లాడుతూ, పంపిణీ చేసిన 56 బ్రెయిలీ కిట్లను భౌతికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. అలాగే పరికరాల నాణ్యతను పరిశీలించి, సంబంధిత పాఠశాలల నుంచి సంతృప్తి ధృవపత్రాలు సేకరించి రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ (డీఐఈసీ) పి. ప్రసాద్ రావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దృష్టి లోపం గల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మరో మైలురాయిగా నిలిచింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న దృష్టి లోపం గల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) డి. వెంకట సుబ్బయ్య తెలిపారు. శనివారం జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సమ్మిళిత విద్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం బ్రెయిలీ టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న దృష్టి లోపం గల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 56 బ్రెయిలీ లెర్నింగ్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కిట్లలో మ్యాథ్స్ వాల్యూమ్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉపయోగపడే యాక్టివిటీస్ సెట్, బేసిక్ టాక్టైల్ గ్లోబ్, టాక్టైల్ జ్యామెట్రీ కిట్ వంటి ఆధునిక విద్యా పరికరాలు ఉన్నాయని చెప్పారు.
ఈ పరికరాల ద్వారా విద్యార్థులు సులభంగా చదవడం, రాయడం, గణిత మరియు భౌగోళిక అంశాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కిట్ల వినియోగానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించి, విద్యార్థులకు సమర్థవంతంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ) సుధీర్ బాబు మాట్లాడుతూ, పంపిణీ చేసిన 56 బ్రెయిలీ కిట్లను భౌతికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. అలాగే పరికరాల నాణ్యతను పరిశీలించి, సంబంధిత పాఠశాలల నుంచి సంతృప్తి ధృవపత్రాలు సేకరించి రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ (డీఐఈసీ) పి. ప్రసాద్ రావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దృష్టి లోపం గల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మరో మైలురాయిగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.