నంద్యాల, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి):
నంద్యాలలో గోవు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ధర్మ వర్ధిని ఆధ్వర్యంలో ఘన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అధ్యక్షత వహించి గోవు సంరక్షణ యొక్క ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గోవు ప్రాధాన్యతను ప్రతిబింబించే ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సమాజంలో గోవు సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎకో మైండ్స్ గ్రూప్ కు చెందిన హుస్సేన్ పాల్గొనగా, అనేక మంది భక్తులు, సేవా సంస్థల ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేశారు.

గోవు మహిమపై నంద్యాలలో ఘన సభ – చాగంటి సందేశం, క్యాలెండర్ ఆవిష్కరణ
నంద్యాల, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి): నంద్యాలలో గోవు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ధర్మ వర్ధిని ఆధ్వర్యంలో ఘన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అధ్యక్షత వహించి గోవు సంరక్షణ యొక్క ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గోవు ప్రాధాన్యతను ప్రతిబింబించే ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సమాజంలో గోవు సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎకో మైండ్స్ గ్రూప్ కు చెందిన హుస్సేన్ పాల్గొనగా, అనేక మంది భక్తులు, సేవా సంస్థల ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేశారు.

