Monday, 20 April 2026
  • Home  
  • మంగళగిరి నేతన్న సర్కిల్ విగ్రహం వద్ద 48 గంటల నిరాహార దీక్షలు
- ఆంధ్రప్రదేశ్

మంగళగిరి నేతన్న సర్కిల్ విగ్రహం వద్ద 48 గంటల నిరాహార దీక్షలు

_చేనేతల న్యాయమైన కోర్కెల సాధనకై_ *,,,* చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నేతన్న విగ్రహం వద్ద ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు 48 గంటల నిరాహార దీక్షలు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నెల్లూరు జిల్లా నాయకులు ఆదివారం నెల్లూరు లోని మన హాస్పిటల్ వద్దనున్న చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్యకారచరణ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో 16 చేనేత సంఘాల ఆధ్వర్యంలో చేనేతల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు మహా ప్రదర్శన, చేనేత గర్జనను నిర్వహించి ప్రభుత్వాలకు చేనేతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు పరిష్కరించలేదని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం ముందుకు రాకపోగా చేనేత శాఖ మంత్రిని కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఇప్పటికీ కూడా భేటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు . చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ముందుకు రాని కారణంగా సరిగ్గా ఏప్రిల్ 22వ తేదీకి చేనేత గర్జన జరిగి రెండు నెలలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 22వ తేదీ నుండి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్ష చేపడుతున్నామని ఈ నిరాహార దీక్షలో రాష్ట్రంలోని చేనేత ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నిరాహార దీక్ష తో నైనా ప్రభుత్వాలు ముందుకు వచ్చి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చెయ్యటానికి పూనుకుంటారని ఆశిస్తూ అలా ప్రభుత్వాలు ముందుకు రాని ఎడల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రంలోని చేనేత వర్గాలు యావత్తు రానున్న కాలంలో ప్రభుత్వాలు తగని మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి చేనేత కార్మికులు, చేనేత పెద్దలు, చేనేత శ్రేయోభిలాషులు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు,, ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీసభ్యులు కటికాల వెంకటేశ్వర్లు, పముజుల శంకరయ్య, కొంగర పెంచలయ్య, పముజుల హరి పాల్గొన్నారు

_చేనేతల న్యాయమైన కోర్కెల సాధనకై_
*,,,*

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నేతన్న విగ్రహం వద్ద ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు 48 గంటల నిరాహార దీక్షలు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నెల్లూరు జిల్లా నాయకులు ఆదివారం నెల్లూరు లోని మన హాస్పిటల్ వద్దనున్న చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్యకారచరణ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో 16 చేనేత సంఘాల ఆధ్వర్యంలో చేనేతల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు మహా ప్రదర్శన, చేనేత గర్జనను నిర్వహించి ప్రభుత్వాలకు చేనేతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు పరిష్కరించలేదని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం ముందుకు రాకపోగా చేనేత శాఖ మంత్రిని కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఇప్పటికీ కూడా భేటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు . చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ముందుకు రాని కారణంగా సరిగ్గా ఏప్రిల్ 22వ తేదీకి చేనేత గర్జన జరిగి రెండు నెలలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 22వ తేదీ నుండి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్ష చేపడుతున్నామని ఈ నిరాహార దీక్షలో రాష్ట్రంలోని చేనేత ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నిరాహార దీక్ష తో నైనా ప్రభుత్వాలు ముందుకు వచ్చి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చెయ్యటానికి పూనుకుంటారని ఆశిస్తూ అలా ప్రభుత్వాలు ముందుకు రాని ఎడల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రంలోని చేనేత వర్గాలు యావత్తు రానున్న కాలంలో ప్రభుత్వాలు తగని మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి చేనేత కార్మికులు, చేనేత పెద్దలు, చేనేత శ్రేయోభిలాషులు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు,,

ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీసభ్యులు కటికాల వెంకటేశ్వర్లు, పముజుల శంకరయ్య, కొంగర పెంచలయ్య, పముజుల హరి పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.