నెల్లూరులో కస్తూరి దేవి గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మానేజ్మెంట్స్ అసోసియేషన్ (APPUSMA ) జనరల్ బాడీ సమావేశం .. స్టేట్ ప్రెసిడెంట్ తులసి విష్ణు ప్రసాద్ గారు, అపుస్మా స్టేట సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ *MV రామచంద్రారెడ్డి* గారు, ముఖ్య అతిధులుగా హాజరై.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్బంగా *ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
అపుస్మా జనరల్ బాడీ మీటింగ్ నెల్లూరు లో జరగడం ఎంతో సంతోషకరమని MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు సుమారు 2000 మంది.. ఒకే చోట ఆసీనులై సమస్యల గురించి చర్చించుకోవడం మంచి పరిణామమని తెలిపారు.
ఈరోజు పార్టీలకతీతంగా ప్రైవేటు పాఠశాలల యజమాన్యాల సమస్యలను గుర్తించి పరిష్కరించడం.. అవసరం అన్నారు.
రాష్ట్రంలో అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ..అపుస్మా సమాజంలో ఉత్తమ సేవలు అందిస్తుందన్నారు.
ఇలాంటి తరుణంలో అపుస్మ కు ప్రభుత్వాలు అండగా నిలిచి.. వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపుస్మా సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి.. పరిష్కరించడం జరిగిందన్నారు.
రాబోయే రోజుల్లో కూడా అపుస్మా.. మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించాలని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అపస్మా నాయకులు, ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


