Wednesday, 26 August 2026
  • Home  
  • దద్దరిల్లిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ – ఏబీవీపీ ఆధ్వర్యంలో 1,500 మందితో భారీ ముట్టడి, విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున – స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏబీవీపీ సమరశంఖం, విద్యార్థుల హక్కుల కోసం పోరుబాట – రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏబీవీపీ,
- రంగారెడ్డి

దద్దరిల్లిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ – ఏబీవీపీ ఆధ్వర్యంలో 1,500 మందితో భారీ ముట్టడి, విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున – స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏబీవీపీ సమరశంఖం, విద్యార్థుల హక్కుల కోసం పోరుబాట – రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏబీవీపీ,

పున్నమి: రంగారెడ్డి జిల్లా, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద వేలాది మంది విద్యార్థులతో ఏబీవీపీ భారీ ఆందోళన చేపట్టింది. సుమారు 1,500 మంది ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించడంతో ప్రాంగణం మొత్తం ఆందోళన నినాదాలతో మార్మోగింది. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి” అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వీరపట్నం జిల్లా కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం హామీలకే పరిమితం కాకుండా వెంటనే కార్యాచరణ చేపట్టాలని జగదీష్ డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఏబీవీపీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన విద్యార్థి ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ ముట్టడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఇకనైనా గుర్తించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో 1 స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్ల కేడి సాయిచరణ్ నేషనల్ కళామంచ్ కో కన్వీనర్ మణికంఠ విభాగ్ కన్వీనర్ ప్రదీప్, శంషాబాద్ జిల్లా కన్వీనర్ పవన్, స్టేట్ టెక్నికల్ సెల్ ఫోన్ లో గుణవంత్ రెడ్డి ,స్టేట్ ఎస్ఎఫ్ఎస్ పుష్పల ఆదర్శ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, భరత్ , మైపాల్ స్టేట్ వనవాసి కో కన్వీనర్ రాజేష్ , నగర కార్యదర్శి గంగవరం వినయ్ , దేవరశెట్టి ప్రణీత్ దండు కార్తీక్, , రామ్ చరణ్ , నవదీప్ , భరత్ వంశీ బన్ను , సందీప్ మల్లేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద వేలాది మంది విద్యార్థులతో ఏబీవీపీ భారీ ఆందోళన చేపట్టింది. సుమారు 1,500 మంది ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించడంతో ప్రాంగణం మొత్తం ఆందోళన నినాదాలతో మార్మోగింది. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి” అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వీరపట్నం జిల్లా కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం హామీలకే పరిమితం కాకుండా వెంటనే కార్యాచరణ చేపట్టాలని జగదీష్ డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఏబీవీపీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన విద్యార్థి ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
కలెక్టరేట్ ముట్టడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఇకనైనా గుర్తించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో 1 స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్ల కేడి సాయిచరణ్ నేషనల్ కళామంచ్ కో కన్వీనర్ మణికంఠ విభాగ్ కన్వీనర్ ప్రదీప్, శంషాబాద్ జిల్లా కన్వీనర్ పవన్, స్టేట్ టెక్నికల్ సెల్ ఫోన్ లో గుణవంత్ రెడ్డి ,స్టేట్ ఎస్ఎఫ్ఎస్ పుష్పల ఆదర్శ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, భరత్ , మైపాల్ స్టేట్ వనవాసి కో కన్వీనర్ రాజేష్ , నగర కార్యదర్శి గంగవరం వినయ్ , దేవరశెట్టి ప్రణీత్ దండు కార్తీక్, , రామ్ చరణ్ , నవదీప్ , భరత్ వంశీ బన్ను , సందీప్ మల్లేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.