నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నెలలు గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలలు గుర్తింపును పూర్తి చేయాలని, అనంతరం జిల్లా స్థాయి కమిటీ సూచనలు మేరకు చిత్తడి నేలల సర్వే, నిర్ధారణ, నోటిఫికేషన్ వంటివి పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.

చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలన్న : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నెలలు గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలలు గుర్తింపును పూర్తి చేయాలని, అనంతరం జిల్లా స్థాయి కమిటీ సూచనలు మేరకు చిత్తడి నేలల సర్వే, నిర్ధారణ, నోటిఫికేషన్ వంటివి పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.

