చిట్వేల్ మండలంలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేసేందుకు శుక్రవారం స్టేట్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపీపీ చిట్వేల్, కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ అగ్రహారం పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థులకు, జడ్పీహెచ్ఎస్ చిట్వేల్లో 7, 9వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించనున్నారు. పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు గురువారం చిట్వేల్ ఎంఆర్సీ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. పరీక్ష నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ కాజా మొయిద్దీన్ తెలిపారు. కార్యక్రమంలో శివరాం ప్రసాద్, మహేంద్ర, సీఆర్పీ చంద్రశేఖర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

చిట్వేల్లో రేపు స్టేట్ అచీవ్మెంట్ సర్వే